సోషల్‌ మీడియా వైద్యం సరికాదు.. | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా వైద్యం సరికాదు..

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

ఖమ్మం సహకారనగర్‌: సోషల్‌ మీడియా ద్వారా అందే సూచనలు, వైద్యానికి ప్రజలు ఆకర్షితులు కావొద్దని ప్రముఖ వైద్యులు యలమంచిలి రవీంద్రనాథ్‌ పేర్కొన్నారు. ఖమ్మం మంచికంటి మీటింగ్‌ హాల్‌లో శుక్రవారం జరిగిన జన విజ్ఞాన వేదిక జిల్లా ఆరో మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రజా వైద్యం ప్రస్తుతం కార్పొరేట్‌ శక్తుల్లోకి వెళ్తోందని, తద్వారా పేదలు మెరుగైన వైద్య సేవలకు దూరమవుతున్నారని తెలిపారు. ఇక కొందరు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యం కాకుండా సోషల్‌ మీడి యా వైద్యానికి ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ఎలాంటి అనారోగ్యమైనా వైద్యులను కలవాలని సూచించారు. అనంతరం జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలవాల నాగేశ్వరరావు తదితరులు మాట్లాడగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌.వీ.రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా అలవాల నాగేంద్రం, ఆర్థిక కార్యదర్శిగా వి.మోహన్‌ ఎన్నికయ్యారు. అలాగే, విద్య, వైద్యం, చెకుముఖి, సాంస్కృతిక, సోషల్‌ మీడియా విభాగాలకు సబ్‌ కమిటీలను ఎన్నుకున్నారు.

జేవీవీ జిల్లా మహాసభలో డాక్టర్‌ రవీంద్రనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement