తిరుమలాయపాలెం: ఆర్థిక లావాదేవీల విషయమై హైదరాబాద్ కోకాపేట్ ప్రాంతంలో హత్యకు గురైన ఉస్మానియా పీహెచ్డీ స్కాలర్ కాంపాటి వెంకట్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన మండలంలోని ఎదుళ్లచెరువులో నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం తీసుకురాగా, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లెపల్లి స్వామి గౌడ్, నాయకులు జక్కుల మధు, బైరు నాగరాజుగౌడ్, నకిరేకంటే సైదులు, బూడిద ప్రవీణ్, జోగు గణేష్, నోముల శేషు, సతీష్, శ్రీనివాస్‌రెడ్డి, తీగల శ్యామ్, అంజి, శ్రవణ్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ వెంకట్ మృతి కుటుంబానికే కాక విద్యార్థి లోకానికి తీరని లోటన్నారు. అలాగే, సర్పంచ్ వినోద, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు బండి రమేష్, షేక్ బషీరుద్దీన్, స్వామి, కాంపాటి బాబు, వెంకటేష్, మందడి ఇజ్రాయిల్ తదితరులు కూడా నివాళులర్పించగా, అంత్యక్రియల్లో పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు.


