ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు నేలకొండపల్లి మండలం కట్టు కాచారంలో పాలేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించాక బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12–30 గంటలకు సత్తుపల్లి మండలం నారాయణపురంలో శ్రీ షిర్డీ సాయి జన మంగళం ట్రస్ట్ సహకారంతో ఏర్పాటుచేసిన కేన్సర్ స్క్రీనింగ్ శిబిరంలో పాల్గొంటారు. అనంతరం సత్తుపల్లి మండలం గంగారం, సత్తుపల్లి, కల్లూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆతర్వాత సాయంత్రం తల్లాడ మండలం పినపాక ఎస్సీ కాలనీలో లబ్ధిదారులకు మంత్రి ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారని క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూ రు దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
యాసంగి సాగుకు
తొందర పడొద్దు
వైరారూరల్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన రైతులు యాసంగి సాగుకు తొందడపడొద్దని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో సర్పంచ్ నూతి వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ఏటా వానాకాలం జిల్లాలో 7.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యేవని, ఈసారి 5.88లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయని తెలిపారు. నీటి లభ్యత లేనందున తక్కువ నీరు అవసరమయ్యే పెసర, మినుముతో పాటు కూరగాయలు సాగుచేసుకోవాల ని సూచించారు. తొలుత గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఏఓ యమాన్ మంజుఖాన్, మాజీ ఉపసర్పంచ్ మల్లు రామకృష్ణ పాల్గొన్నారు.
రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: అండర్– 10, 12, 14 విభాగాల్లో అథ్లెటిక్స్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికకు ఈనెల 4న పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మందుల వెంకటేశ్వర్లు తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే ఈ పోటీలకు క్రీడాకారులు వయసు ధ్రువీకరణపత్రాలతో పాటు ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.
ఫుట్‌బాల్ జట్టు ఎంపికకు..
ఖమ్మం అర్బన్: ఉమ్మడి జిల్లా అండర్–17 బాలుర ఫుట్‌బాల్ జట్టును ఈనెల 4న ఎంపిక చేయనున్నారు. ఎంపిక పోటీలు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సెడార్ వాలీ పాఠశాలలో జరుగుతాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.కృష్ణయ్య, ఎస్‌జీఎఫ్ బాధ్యులు బి.బావ్‌సింగ్, వై.చిన్ని, కె.ఆదర్శ్‌కుమార్ తెలిపారు. 2010 జనవరి 1 తర్వాత జన్మించి, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, ఇంటర్ విద్యార్థులైతే ఎస్సెస్సీ మెమోతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99492 93600 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు
రఘునాథపాలెం: మండలంలోని కోయచలక శివారులో శుక్రవారం కూలీలతో వెళ్తున్న ఆటో ను టిప్పర్ ఢీకొట్టగా కామంచికల్‌కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఘటనలో మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాక ప్రమాదాల కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈమేరకు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, ట్రాఫిక్ సీఐ శివప్రసాద్, ఆర్‌అండ్‌బీ అధికారులు పరిశీలించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. రహదారి నిర్మాణం, మలుపులను పరిశీలించాక, ప్రమాదాలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, మార్కింగ్ చేయించాలని నిర్ణయించారు. కాగా, క్షతగాత్రులను ఆస్పత్రిలో నాయకులు దయాకర్‌రెడ్డి, ప్రతాపనేని రఘు తదితరులు పరామర్శించి చికిత్సపై వైద్యులతో మాట్లాడారు.


