జూన్‌ నుంచి ప్రక్రియ.. | - | Sakshi
Sakshi News home page

జూన్‌ నుంచి ప్రక్రియ..

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

జూన్‌ నుంచి ప్రక్రియ.. చివరి దశకు పంపిణీ.. చకచకా విచారణ.. మరో నాలుగు రోజులే..

1,70,389 మందిలో

1,39,127 మంది హాజరు

ఈనెల 7వరకు చివరి అవకాశం

ఈ ఏడాది జూన్‌ 25న ‘సర్‌’ ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలో మొత్తం 12,43,781 మంది ఓటర్లు ఉండగా.. ఆగస్టు 17న ప్రకటించిన ముసాయిదాలో ఓటర్ల సంఖ్య 10,85,927కు పడిపోయింది. ఇందులో పేర్లలో అక్షరదోషాలు, చిరునామా, ఫొటోలు తప్పుగా వచ్చిన వారిని అనామలీస్‌ జాబితాలో చేర్చారు. ఇక 2002 ఓటరు జాబితాతో పోల్చినప్పుడు వివరాలు లేని వారి పేర్లను మ్యాపింగ్‌ జరగలేదని ప్రకటించి మొత్తంగా 1,75,841 మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.

అనామలీస్‌, అన్‌మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు జారీ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే 1,70,389 మందికి నోటీసులు ఇవ్వగా మరో 5,452 మందికి ఇస్తే పూర్తవుతుంది. అభ్యంతరాలు, క్లెయిమ్‌ల సేకరణకు తక్కువ సమయం ఉన్నందున నోటీసుల జారీపై అధికారులు దృష్టి సారించారు. బీఎల్‌ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వడంతో నిర్ణీత తేదీన ఏమేం పత్రాలతో రావాలో సూచిస్తున్నారు.

నోటీసులు అందుకున్న ఓటర్లలో పలువురు ఈఆర్వోలు, సిబ్బంది ఎదుట హాజరై తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను అందజేస్తున్నారు. నోటీసులో తెలిపిన అభ్యంతరాలకు సంబంధించి 11 ధ్రువీకరణ పత్రాల్లో అవసరమైనవి సమర్పిస్తున్నారు. ఈనెల 1వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 1,39,127 మంది విచారణకు హాజరై ధ్రువపత్రాలను అందజేశారు. ఇందులో 1,15,677 మంది పేర్లను తుది ఓటర్ల జాబితాకు ఖరారు చేయగా, మిగిలిన వాటిపై విచారణ కొనసాగుతోంది.

నోటీసులు అందుకున్న ఓటర్లు క్లెయిమ్‌ చేసుకునేందుకు ఎన్నికల సంఘం విధించిన గడువు మరో నాలుగు రోజులే ఉంది. ఈలోపు ఓటర్లు తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో స్థానం దక్కుతుంది. గతంలో సెప్టెంబర్‌ 16 వరకే ఉన్న గడువును ఈనెల 7 వరకు పొడిగించారు. తొలుత నోటీసులు అందుకున్న ఓటర్లు ఈఆర్వో లేదా సంబంధిత అధికారి వద్దకు వెళ్లి ధ్రువపత్రాలను అందజేయాల్సి వచ్చేది. కానీ ఓటర్ల ఇంటికే బీఎల్‌ఓలు వెళ్లాలని ఆదేశించడంతో వారే వచ్చి పత్రాలు సేకరించి ఈఆర్వోలకు అందజేస్తారు. ఆయా పత్రాలపై అధికారులు సంతృప్తి చెందితే జాబితాలో చోటు కల్పిస్తారు.

ఖమ్మంలో

ఓటర్లు సమర్పించిన

పత్రాలను పరిశీలిస్తున్న బీఎల్‌ఓలు

‘సర్‌’ నోటీసులకు

ఓటర్ల నుంచి స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement