గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం | - | Sakshi
Sakshi News home page

గాంధీజీ అడుగుజాడల్లో నడుద్దాం

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

ఖమ్మం సహకారనగర్‌: మహాత్మా గాంధీ జయంతి అడుగుజాడల్లో నడవడం ద్వారా శాంతి, సౌభ్రాతృత్వంతో పాటు స్వచ్ఛ సమాజం సాధ్యమవుతుందని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆతర్వాత కలెక్టరేట్‌లో గాంధీ చిత్రపటానికి నివాళులర్పించాక కలెక్టర్‌ మాట్లాడారు. అహింస, సత్యం అనే ఆయుధాలతో స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడిలా నిలిచిపోయారని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామమూర్తి, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఫిరంగి, ఎస్‌టీఓ మోదుగు వేలాద్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

●ఖమ్మంక్రైం: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపట వద్ద సీపీ సునీల్‌దత్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, నైతిక విలువల మార్గాన్ని అందరూ అనుసరించాలని సూచించారు. అడిషనల్‌ డీసీపీలు కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు నర్సింహారావు, సాంబరాజు, ఆర్‌ఐ కామరాజు, సీఐ సర్వయ్య, ఏఓ కళావతి, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హేమనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

జయంతి వేడుకల్లో కలెక్టర్‌ దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement