పత్తి రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతులను ఆదుకోవాలి

Oct 3 2026 12:14 AM | Updated on Oct 3 2026 12:14 AM

పత్తి రైతులను ఆదుకోవాలి పది ఎకరాల్లో తడిసి పోయింది. రైతులు జాగ్రత్తలు పాటించాలి ●

నాలుగెకరాల్లో పత్తి సాగు చేశా. ప్రారంభంలో వర్షాలు లేకున్నా అష్టకష్టాలు పడి నీటి తడులు పెట్టి కాపాడుకున్నా. పూత, కాత వచ్చే దశలో ఇటీవల వర్షాలతో పంట ఎర్రబారుతోంది. దిగుబడి పడిపోయి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేనందున రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– నేరడి భిక్షం, రైతు, ఎదుళ్లచెరువు

పది ఎకరాల్లో పత్తి సాగు చేశాను. పంట చేతికొచ్చే దశకు చేరడంతో పత్తి తీసేందుకు కూలీలను కూడా మాట్లాడాం. ఈలోగా భారీ వర్షాలకు పత్తి తడిసి నల్లగా మారింది. దీంతో పత్తి తీయడానికి ఆలస్యం జరుగుతుంది. అంతేకాక నాణ్యత తగ్గిపోయి ధర వచ్చే పరిస్థితి లేదు.

– హేమానందిని, రైతు, తల్లాడ

వర్షాలతో పత్తికాయలు నల్లబడ్డాయి. ఈ కాయలు విచ్చుకున్నాక పొడి వాతావరణం ఉన్నప్పుడే

ఏరించి పొడి ప్రదేశంలో పోసి ఆరబోయాలి.

నలకలు లేకుండా ఏరించాలి. ఆతర్వాత

మార్కెట్‌కు తీసుకెళ్తే సరైన ధర వచ్చే అవకాశం

ఉంది. మొక్కలు ఎర్రబడి ఎండిపోతుండడంతో నివారణ చర్యలపై రైతులకు సూచనలు ఇస్తున్నాం.

– డి.బాలాజీ, ఎం.డీ.తాజుద్దీన్‌,

కొణిజర్ల, తల్లాడ ఏఓలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement