పెనుబల్లి: కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది రావడానికి సమయం పట్టనుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులే ముందడుగు వేశారు. ఈమేరకు మండలంలోని గంగదేవిపాడుకు చెందిన నాయకుడు, రైతు కనగాల సాంబశివరావు సమకూర్చిన రూ.2లక్షలతో 750 కేవీ ట్రాన్స్ఫార్మర్ను అద్దెకు తీసుకొచ్చారు. దీన్ని రాతోని ఎత్తిపోతల పథకం వద్ద అమర్చి, లిఫ్ట్ మోటార్లకు కనెక్షన్ ఇచ్చి శుక్రవారం ప్రారంభించారు. రైతులు పొన్నగంటి వాణిపతిరావు, అన్నపురెడ్డి శ్రీనివాస్, జిల్లెళ్ల శ్రీను, చిలుకుబత్తుల చెన్నారావు, బొర్ర మల్లయ్య, జిల్లెళ్ల నరసింహాస్వామి, బొర్రా బాబు పాల్గొన్నారు.


