ఓటర్ల తొలగింపుపై విచారణ చేపట్టాల్సిందే... | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల తొలగింపుపై విచారణ చేపట్టాల్సిందే...

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: అర్హుల ఓట్లు తొలగించకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ఖమ్మంలో నిరసన చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా చౌక్‌లో సోమవారం జరిగిన ధర్నాలో కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్‌, నాగండ్ల దీపక్‌ చౌదరి మాట్లాడుతూ ఓటర్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక ఓటర్‌ జాబితా సమగ్ర సవరణ పేరిట అర్హుల పేర్లు తొలగించకుండా, ప్రతీ అభ్యంతరాన్ని పరిశీలించాలన్నారు. తొలుత జ్ఞానేష్‌ దిష్టిబొమ్మను దహనం చేయగా.. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, సుడా, జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్‌ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మహ్మద్‌ ఖాదర్‌ బాబా, యరగర్ల హన్మంతరావుతో పాటు నాయకులు రాయల నాగేశ్వరరావు, గజ్జెల్లి వెంకన్న, కొత్త సీతారాములు, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, మొక్క శేఖర్‌గౌడ్‌, ఆసిఫ్‌, వడ్డెబోయిన నర్సింహారావు, యడ్లపల్లి సంతోష్‌, మలీదు వెంకటేశ్వరరావు, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని మంజుల, నరేంద్ర, లకావత్‌ సైదులు నాయక్‌, ముక్తార్‌, కమర్తపు మురళి, పల్లెబోయిన భారతి చంద్రం, పైడిపల్లి సత్యనారాయణ, కన్నం వైష్ణవి, ప్రసన్నకృష్ణ, బచ్చలకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలో కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు సత్యనారాయణ, దీపక్‌ చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement