హబ్‌లో ఇక సాఫీగా పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

హబ్‌లో ఇక సాఫీగా పరీక్షలు

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని తెలంగాణ డయోగ్నోస్టిక్‌ హబ్‌కు ప్రభుత్వం నూతన పరికరాలు కేటాయిస్తోంది. హబ్‌ ఏర్పాటై ఐదేళ్లు కావడంతో దాదాపు పరికరాలన్నీ కాలం చెల్లగా తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో రూ.3కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్‌ అనలైజన్‌ మిషన్‌ను కేటాయించారు. హబ్‌కు సోమవారం చేరిన ఈ యంత్రాన్ని రెండు రోజుల్లో సంబంధిత కంపెనీ ఇంజనీర్లు అమర్చనున్నారని అధికారులు తెలిపారు.

ఇబ్బందులు తీర్చేలా...

హబ్‌లోని పరికరాలు తరచూ మొరాయిస్తున్నాయి. ఇంజనీర్లు వచ్చి మరమ్మతులు చేసినా కొద్దిరోజులకు అదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం హబ్‌లో గంటకు 1,520 పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం కలిగిన యంత్రాలు ఉన్నాయి. కెమిస్ట్రీ ఎనలైజర్‌, ఇమ్యూనో ఎనలైజర్‌, సీబీపీ మిషన్‌ ఉన్నా తరచూ ఇబ్బందులు తలెతున్నాయి. ఈక్రమాన కెమిస్ట్రీ ఎనలైజర్‌, ఇమ్యూనో ఎనలైజర్‌ ద్వారా చేసే పరీక్షలను ప్రస్తుతం కేటాయించిన ఇంటిగ్రేటెడ్‌ అనలైజర్‌ మిషన్‌తో చేయొచ్చని చెబుతున్నారు. పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారేకాక జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల నుంచి సైతం నిత్యం 2వేలకు పైగా శాంపిళ్లు హబ్‌కు వస్తుంటాయి. హబ్‌ 2021లో ఏర్పాటుకాగా, ఇప్పటి వరకు 7,05,383 మందికి 26,15,593 పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు పాత మిషన్ల స్థానంలో నూతన ఇంటిగ్రేటెడ్‌ అనలైజర్‌ మిషన్‌ రావడంతో ఇన్నాళ్లు ఎదురైన ఇబ్బందులు తీరతాయని భావిస్తున్నారు.

పెద్దాస్పత్రికి చేరిన ఇంటిగ్రేటెడ్‌ ఎనలైజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement