ఆధారపడకుండా... ఆదర్శంగా! | - | Sakshi
Sakshi News home page

ఆధారపడకుండా... ఆదర్శంగా!

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

పెనుబల్లి: కళ్ల ముందే ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎవరిపై ఆధారపడకుండా ఏకమయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్‌ అద్దెకు తెచ్చుకోవడమే కాక దాన్ని పొలాల వద్ద చేర్చేందుకు రోడ్డు కూడా మరమ్మతు చేయించుకున్నారు. పెనుబల్లి మండలంలోని రాతోని ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లను కొన్నాళ్ల క్రితం ధ్వంసం చేసిన దుండగులు అందులోని రాగి వైర్‌ ఎత్తుకెళ్లారు. ఆ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు కేటాయించగా టెండర్‌ ప్రక్రియ సైతం పూర్తయింది. కానీ ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చేందుకు సమయం పట్టే అవకాశముండగా... ఆలోగా రెండు వేల ఎకరాలకు పంటలకు నీరు అందించడం కష్టమవుతోంది. దీంతో రైతుల వినతి మేరకు గంగదేవిపాడు గ్రామానికి చెందిన నాయకుడు, రైతు కనగాల సాంబశివరావు రూ.2లక్షల అద్దెతో ట్రాన్‌ఫార్మర్లు తెప్పించారు. అయితే, ఈ ట్రాన్స్‌ఫార్మర్లను ఎత్తిపోతల వద్దకు చేర్చేందుకు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో రైతులంతా కలిసి సొంత ఖర్చుతో గ్రావెల్‌ తెప్పించి మరమ్మతు చేయించుకున్నారు. సాయంత్రానికి లిఫ్ట్‌ వద్దకు ట్రాన్స్‌ఫార్మర్లు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement