● కేంద్ర మంత్రికి తుమ్మల విజ్ఞప్తి
రఘునాథపాలెం: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం కింద తొలి దశలో రఘునాథపాలెం మండలానికి 1,300 ఇళ్లే మంజూరయ్యాయని తెలిపారు. మండలంలో సుమారు 9వేల ఎస్టీ కుటుంబాలతో పాటు ఇతర పేద, అర్హులైన కుటుంబాలు ఉన్నందున 2వేల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఏజెన్సీ, గిరిజన గ్రామపంచాయతీల్లో పనులకు రూ.110 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాదారం, పాలేరులో మంత్రి పర్యటిస్తారు. అలాగే, కూసుమంచిలో జీపీ భవన నిర్మాణానికి, 11 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ 22వ వార్డులో గిరిజన బాలుర వసతిగృహ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ఖమ్మంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షించనున్న మంత్రి, సాయంత్రం ములకలపల్లి మండలం చౌటిగూడెంలో ఇటీవల హత్యకు గురైన నర్స్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు
డీడీగా పదోన్నతి
బస్తీ దవాఖానాల్లో
పోస్టులకు దరఖాస్తులు
ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు. మూడు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గాను ఎంబీబీఎస్ అర్హత కలిగి ఉండాలని, మూడు నర్సింగ్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడంతో పాటు పూర్తి వివరాలతో నింపిన దరఖాస్తును తమ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోగా అందజేయాలని సూచించారు. వివరాలకు https//khammam.telangana. gov.in/ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో...
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిపై వైద్య పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.శంకర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 7న సాయంత్రం 4గంటల్లోగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని, దరఖాస్తుదారులకు 8వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించారు. అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీఏఎస్ స్పెషలిస్ట్ తదితర పోస్టులతో పాటు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డీవీఎల్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, రేడియో డయాగ్నోసిస్, ఫోరెన్సిక్ మెడిసిన్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్ లేదా కాలేజీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని సూచించారు.


