ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యాన శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటుచేసిన 3కే రన్‌ను డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభంచారు. సర్దార్‌ పటేల్‌ స్టేడియం వద్ద ప్రారంభమైన రన్‌ ఇల్లెందు క్రాస్‌, జెడ్పీ సెంటర్‌ మీదుగా తిరిగి స్టేడియంకు చేరుకుంది. అనంతరం వివిధ క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయగా, ఉత్తమ కోచ్‌గా ఎంపికై న వీ.వీ.సాంబమూర్తిని సన్మానించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ ఓ సునీల్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జిల్లా కీర్తిని నిలబెట్టాలని సూచించారు. ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.క్రిష్టాఫర్‌బాబు, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు బి.గోవిందరెడ్డి, వీవీఎస్‌.మూర్తి, పరిపూర్ణాచారి, ఎం.డీ.గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

రేక్‌ పాయింట్‌కు 2,327 మె.టన్నుల యూరియా

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు సీఐఎల్‌ కంపెనీకి చెందిన 2,327.31 మెట్రిక్‌ టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 1,127.31 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 600 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 500 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం డీఏఓ ధనసరి పుల్లయ్య తెలిపారు. మిగతా 100 మెట్రిక్‌ టన్నులను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.

గరిష్ట స్థాయిని దాటిన

వైరా రిజర్వాయర్‌

వైరా: వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం శనివారం సాయంత్రం 18.5 అడుగులకు చేరింది. రిజర్వాయ ర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా, కొద్దిరోజులుగా గోదావరి జలాలను రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా తరలిస్తున్నారు. దీంతో రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటడంతో ఐదు అలుగు ల ద్వారా వరద బయటకు వెళ్తోంది. ఇదే సమయాన అధికారులు రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వా రా నీటిని సాగు అవసరాలకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement