అవయవదానంతో ఇంకొందరికి జీవితం | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో ఇంకొందరికి జీవితం

Aug 14 2026 7:38 AM | Updated on Aug 14 2026 7:38 AM

ఖమ్మం వైద్యవిభాగం: అవయవదానంతో మనిషి మరణించినా మరికొందరికి జీవితాన్ని ప్రసాదించే అవకాశం దక్కుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దేవీమానస పేర్కొన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్బంగా గురువారం ఖమ్మంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జనరల్‌ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరణానంతరం కూడా ఇంకొందరికి జీవితాలకు వెలుగు ఇచ్చే అవకాశం ఉన్న అవయవదానంపై యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్పత్రి మెడిక ల్‌ సూపరింటెండెంట్‌ నరేందర్‌ మాట్లాడగా, డిప్యూ టీ సూపరింటెండెంట్‌ బి.కిరణ్‌కుమార్‌, ఆర్థో ప్రొఫె సర్‌ ఎల్‌.కిరణ్‌కుమార్‌, ఆర్‌ఎంఓ రాంబాబు, వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement