సుమారు దశాబ్దం తర్వాత పోలీసుల చేతుల్లోకి లాఠీలు వచ్చాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలులో భాగంగా ధర్నాలు, ర్యాలీ వద్ద పోలీసులు ఇన్నాళ్లు లాఠీలు వాడలేదు. ఇటీవల ఉన్నతాధికారులు అన్ని సమయాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు
తప్పనిసరేం కాదని
సూచించినట్లు తెలిసింది. దీంతో గురువారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యాన తిరంగా యాత్ర, సీపీఐ ప్రజాచైతన్య యాత్ర ర్యాలీ నిర్వహించగా.. బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది లాఠీలతో కనిపించారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్


