ఖమ్మంఅర్బన్: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన బొమ్మ విద్యాసంస్థల వైస్ చైర్మన్ బొమ్మ సత్యప్రసాద్‌కు పలువురు నివాళులర్పించారు. ఆయన నివాసంలో మృతదేహం వద్ద నివాళులర్పించి బొమ్మ విద్యాసంస్థల అధినేత బొమ్మ నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, నాయకులు దొబ్బల సౌజన్య, తుపాకుల ఎలగొండ స్వామి, మాజీ మేయర్లు పునుకొల్లు నీరజ, డాక్టర్ పాపాలాల్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అలాగే, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యాసంస్థల బాధ్యులు బాగం హేమంతరావు, రాజా, వాసిరెడ్డి నాగేంద్రకుమార్, మల్లెంపాటి శ్రీధర్, గుండాల కృష్ణ, మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, కొప్పు నరేశ్‌కుమార్, దొడ్డ రవి, చావా రాము, బయ్యన బాబు, కమర్తపు మురళి, మందడపు మనోహర్ కూడా నివాళులర్పించారు. కాగా, శుక్రవారం ఉదయం సత్యప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


