రఘునాథపాలెం: రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాలకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన నిర్వహించిన సీపీ గెట్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ సందర్భంగా రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు తెలిపారు. 2025–26లో డిగ్రీ పూర్తి చేసిన ఓర్సు స్రవంతి తెలుగులో రాష్ట్రస్థాయి 28వ ర్యాంకు, అల్లి అఖిల గణితశాస్త్రంలో 66వ ర్యాంకు సాధించగా, మరో పది మంది విద్యార్థినులు500లోపు ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌తో పాటు ఆర్‌సీఓ సీహెచ్.రాంబాబు, అధ్యాపకులు అభినందించారు.
ఆరు జిల్లాల
మత్స్యకారులకు శిక్షణ
కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు జరిగే శిక్షణ గురువారం ప్రారంభమైంది. ఖమ్మం, సిద్ది పేట, వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల మత్స్యకారులు పాల్గొనగా తొలి రో జు బయోప్లాక్ విధానంలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు నూత న సాంకేతిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకంతో లాభాలు సాధించాలని కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. గ్రోవెల్ ఫార్ములేషన్ ఫీడ్ సీనియర్ టెక్నీషియన్ డాక్టర్ జగదీష్, శాస్త్రవేత్త దివ్య వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
వేణుకుమార్‌కు
రూ.లక్ష ఆర్థికసాయం
●అండగా నిలిచిన ఎంపీ రవిచంద్ర
ముదిగొండ: ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేద ని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మండలంలోని న్యూలక్ష్మీపురానికి చెందిన గడ్డం వేణుకుమార్ ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా రు. ఈ సందర్భంగా ఆయనకు రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు చెక్కును జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్‌ఎస్ నాయకులు గురువారం వేణుకుమార్‌కు అందజేశారు. అనంతరం వారు నిరుద్యోగులను విస్మరించి పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి యువతే తగిన గుణపాఠం చెబుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, వెంకట్‌గౌడ్, సర్పంచ్ సలీమున్నీసాబేగం, నాయకులు రమేశ్, సీతారామ య్య, కిరణ్, హరీశ్, ఖాసీం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బియ్యం లారీ స్వాధీనం
ఏన్కూరు: అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీని ఏన్కూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలో పోలీసులు గురువారం వాహనాల తనిఖీ చేపడుతుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీని గుర్తించారు. ఇందులో 250 క్వింటాళ్ల దొడ్డు బియ్యం ఉండగా, లారీని పోలీస్‌స్టేషన్ తరలించి సివిల్ సప్లయీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ నారబోయిన సంధ్య తెలిపారు.


