ముదిగొండ: ముదిగొండలోని పలు హోటళ్లు, స్వీట్‌షాప్‌లలో జిల్లా ఇన్‌చార్జ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శరత్ ఆధ్వర్యాన గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు దుకాణాల్లో శాంపిళ్లు సేకరించడమే కాక లైసె న్స్ లేని దుకాణాదారులకు హెచ్చరిక జారీ చేశారు. హోటళ్లలో శుభ్రత లేకపోయినా, నాణ్యత పాటించకున్నా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఫోన్‌తో స్పందన
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో పలువురు హోటళ్ల నిర్వాహకులు నాణ్యత పాటించడం లేదని, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఫోన్ చేయగా.. జిల్లా పుడ్ ఇన్‌స్పెక్టర్ వి.శరత్ ఆధ్వార్యన తనిఖీలు చేపట్టారు. పలు హోటళ్లు, బేకరీల్లో శాంపిళ్లు సేకరించడమే కాక నాణ్యత, తయారీ తేదీలు, ఇతర వివరాలను పరిశీలించారు.
వైద్య పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని మణుగూరు ప్రాంతీయ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, చర్ల సీహెచ్‌సీలో గైనకాలజీ పోస్టుతో పాటు పిల్లల వైద్య నిపుణుల పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన వైద్యులను నియమించనున్నట్లు డీసీహెచ్‌ఎస్ జి.రవిబాబు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


