తిరుమలాయపాలెం: మండలంలోని గోపాలపురం పాఠశాల శిథిల దశకు చేరడంతో ఉపాధ్యాయురాలు సొంత ఖర్చులతో షెడ్డు ఏర్పాటు చేయించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. ఈ విషయం తెలియడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ దివాకర టీ.ఎస్. గురువారం పాఠశాలను సందర్శించారు. ఈమేరకు పాఠశాల భవన నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక సొంత నగదుతో షెడ్డు వేయించిన ఉపాధ్యాయురాలు ఇందిరను అభినందించారు. తహసీల్దార్ విల్సన్ ఎంపీడీఓ సిలార్ సాహెబ్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి ఎంఈఓ బాబు, సర్పంచ్ నల్లమల కీర్తి పాల్గొన్నారు.
షెడ్డు వేయించిన ఉపాధ్యాయురాలికి
కలెక్టర్ సన్మానం


