పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం

Mar 13 2026 7:42 AM | Updated on Mar 13 2026 7:42 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యమని టీపీసీసీ డాక్టర్స్‌–మెడికల్‌ హెల్త్‌ విభాగం రాష్ట్ర చైర్మన్‌ రాజీవ్‌ తెలిపారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో పార్టీ మెడికల్‌ – హెల్త్‌ విభాగం జిల్లా చైర్మన్‌గా నియమితులైన డాక్టర్‌ కాపా మురళీకృష్ణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజీవ్‌ మాట్లాడుతూ.. ప్రత్యే క శ్రద్ధతో పనిచేసే వ్యక్తిని హెల్త్‌ విభాగం చైర్మన్‌గా నియమించినట్లు తెలిపారు. ఆతర్వాత కాంగ్రెస్‌ జిల్లా, నగర అధ్యక్షులు సత్యనారాయణ, నాగండ్ల దీపక్‌చౌదరి, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. మురళీకృష్ణ పదవికి వన్నెతేవాలని, పేదలకు వైద్యం అందించడంలో ముందు నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం, వైరా మార్కెట్‌ చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, బోళ్ల గంగారావు, నాయకులు కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, సయ్యద్‌ గౌస్‌, మొక్కాశేఖర్‌గౌడ్‌, మూడుముంతల గంగరాజు యాదవ్‌, దాసరి దానియేలు, రంగా జనార్దన్‌, కిలారి అనిల్‌కుమార్‌, వేల్పుల మురళి పాల్గొన్నారు.

టీపీసీసీ డాక్టర్స్‌ – మెడికల్‌ హెల్త్‌ విభాగం రాష్ట్ర చైర్మన్‌ రాజీవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement