కల్యాణం చూతము రారండి..! | - | Sakshi
Sakshi News home page

కల్యాణం చూతము రారండి..!

Mar 13 2026 7:42 AM | Updated on Mar 13 2026 7:42 AM

● శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు ● ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ నుంచి సర్వీసులు ● హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులకు రిజర్వేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి భద్రాచలానికి

నడిపే సర్వీసులు

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా..

● శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు ● ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ నుంచి సర్వీసులు ● హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులకు రిజర్వేషన్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: భద్రాచలంలో శ్రీసీతా రామచంద్ర స్వామివారి కల్యాణ మహో త్సవానికి వచ్చే భక్తుల కోసం టీజీఎస్‌ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 27, 28వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని డిపోల నుంచి షెడ్యూల్‌ సర్వీసులకు తోడు వీటిని నడిపిస్తారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి కూడా భద్రాచలానికి బస్సులు నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి 234, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 172 బస్సులు శ్రీరామనవమికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్‌లో సీ్త్ర–శక్తి పథకం అమల్లో ఉన్నందున భక్తుల సంఖ్య గణనీ యంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి...

హైదరాబాద్‌ నుంచి భద్రాచలానికి, భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడమే కాక వీటిని రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవికాక ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్‌ ఒక బస్సు నడిపిస్తారు. ఖమ్మం రీజియన్‌లోని డిపోల నుంచి భద్రాచలానికి షెడ్యూల్‌ బస్సులతో పాటు అదనంగా 234 సర్వీసులు, భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తుల కోసం 30 బస్సులు ఏర్పాటు చేస్తారు. గత అనుభవాల దృష్ట్యా ఆర్టీసీ ఖమ్మం ఆర్‌ఎం ఏ.సరిరామ్‌ నేతృత్వాన అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

రోజువారీ సర్వీసులకు అదనం

ఉమ్మడి జిల్లా నుంచి భద్రాచలానికి రోజు వారీ 113 సర్వీసులు కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా రెండు రోజుల పాటు మరో 121 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ నుంచి రోజువారీ 45 బస్సులకు తోడు అదనంగా 127బస్సులు ఏర్పాటు చేస్తారు. విజయవాడ – భద్రాచలం రూట్‌లో అత్యధికంగా 103 బస్సులు నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం వైపు వెళ్లే భక్తుల కోసం భద్రాచలం జూనియర్‌ కళాశాల మైదానంలో పాయింట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాయింట్‌లో దిగిన వారు ఆలయానికి వెళ్లేందుకు ఆలయ ఆర్చీవరకు రెండు ప్రత్యేక బస్సులను నిరంతరాయంగా నడిపిస్తూ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు.

డిపో రూట్‌ బస్సుల

సంఖ్య

విజయవాడ విజయవాడ – భద్రాచలం 103

తిరువూరు తిరువూరు – భద్రాచలం 06

జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం – భద్రాచలం 15

తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం – భద్రాచలం 08

కాకినాడ కాకినాడ – భద్రాచలం 23

విశాఖపట్నం విశాఖపట్నం – భద్రాచలం 07

రాజమండ్రి రాజమండ్రి – భద్రాచలం 10

శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. అన్ని బస్టాండ్ల నుంచి రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపిస్తాం. ఇందులో ఖమ్మం, హైదరాబాద్‌కు ఎక్కువ సర్వీసులు ఉంటాయి. తెలంగాణ, ఏపీలోని ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అదనపు సర్వీసులు నడిపిస్తుంది. – ఏ.సరిరామ్‌, ఆర్‌ఎం, ఖమ్మం రీజియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement