454 పోస్టల్ బ్యాలెట్ల వినియోగం
వైరా : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతుండగా విధుల్లో పాల్గొనే అధికారులు చివరి రోజైన ఆదివారం పోస్టల్ బ్యాలెట్లను సద్వినియోగం చేసుకున్నారు. వైరా మున్సిపల్ పరిధిలో 56 పోస్టల్ బ్యాలెట్‌లు ఉండగా 54 మంది, మధిరలో 69కి 66, సత్తుపల్లిలో 110కి 108, ఏదులాపురంలో 189కి 186, కల్లూరులో 42 బ్యాలెట్లకు గాను 40 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. మొత్తం 466 పోస్టల్ బ్యాలెట్లకు గాను 454 మంది అధికారులు ఓటు వేశారు.
రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో ఈనెల 10వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప న శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. బీమా కంపెనీలో ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్, రిలేషన్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి 15 పోస్టులకు డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులని వెల్లడించారు. ఆసక్తి, అర్హత గలవారు ఉదయం 10 గంటలకు మొదలయ్యే జాబ్‌మేళాకు హాజరుకావాలని, వివరాలకు 81422 90909 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
2,646 మె.టన్నుల యూరియా రాక
చింతకాని: మూడు జిల్లాల అవసరాలకు గాను చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు క్రిబ్‌కో కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,246మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మె.టన్నులతో పాటు మహబూబాబాద్ జిల్లాకు 700 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు ఏఓ (టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. మిగతా 200 మెట్రిక్ టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
స్విమ్మింగ్‌లో రజత పతకం
ఖమ్మం స్పోర్ట్స్ : విజయవాడ కృష్ణా నదిలో జరిగిన నాలుగు రాష్ట్రాల స్థాయి ఓపెన్ స్విమ్మింగ్ పోటీల్లో ఖమ్మానికి చెందిన బోడేపూడి నాగేశ్వరరావు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకంతో పాటు రూ.6వేల నగదు బహుమతి దక్కించుకున్నారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన 700 మంది స్విమ్మర్లు పాల్గొనగా ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున 22 మంది ఎనిమిది కేటగిరీల్లో పాల్గొన్నారు. ఇందులో నాగేశ్వరరావు 1.5 కిలో మీటర్ల దూరం ఈది పతకం సాధించగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోదాటి గిరి, మందలపల్లి లక్ష్మణ్ తదితరులు అభినందించారు.
ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలి
బోనకల్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బోనకల్ మండలం పెద్దబీరవల్లిలో ఆదివారం జరిగిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయడం లేదన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంతో పాటు డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని, టెట్ విషయంలో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీని అమలు చేయడంతో పాటు ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ జిల్లా కార్యదర్శి గుగులోత్ రామకృష్ణ, నాయకులు హన్మంతరావు, కృష్ణారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
454 పోస్టల్ బ్యాలెట్ల వినియోగం
454 పోస్టల్ బ్యాలెట్ల వినియోగం
454 పోస్టల్ బ్యాలెట్ల వినియోగం


