ఇకపై మేమూ ఓటర్లమే!
వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’
● తీరిన కొమ్మేపల్లి కాలనీవాసుల కష్టాలు ● ఆరేళ్ల తర్వాత సమస్యకు పరిష్కారం
సత్తుపల్లి: కొమ్మేపల్లి పునరావాస కాలనీ ఏర్పడి ఆరేళ్లు కావస్తోంది.. మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పాటు ఓటు హక్కు కల్పించి సమస్యలు పరిష్కరించండి అంటూ స్థానికులు ఎవరికీ మొరపెట్టుకున్నా ఆలకించలేదు. ప్రస్తుతం ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలతో అధికారుల్లో చలనం రాగా కాలనీలోని 449మందికి ఓటు హక్కు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి ఓసీతో తరలింపు
కిష్టారం పంచాయతీ పరిధిలో 449మంది ఓటర్లను కుటుంబాలతో సహా ఉండగా ఆ ప్రాంతాన్ని ఆరేళ్ల క్రితం సింగరేణి ఓసీ విస్తరణ భాగంగా సేకరించారు. ఆపై నిర్వాసితులకు సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి అయ్యగారిపేట రెవెన్యూలో ఇళ్లస్థలాలు కేటాయించగా ఇళ్ల నిర్మించుకున్నారు. అయితే, వీరి ఓట్లను కిష్టారం పంచాయతీనే కొనసాగించడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలో ఓట్లు వేయగలిగా రు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జాబితా నుంచి తొలగించిన అధికారులు మున్సిపాలిటీలో మాత్రం ఓటుహక్కు కల్పించలేదు. దీంతో మండల స్థాయి మొదలు జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోగా, తాజాగా విడుదలైన మున్సి పల్ ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ స్థానం దక్కలేదు.
కిష్టారం పంచాయతీలో ఓటు తొలగించారు. మున్సిపాలిటీలో ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదు. చివరకు ‘సాక్షి’ పత్రికలో మా సమస్య ప్రచురితం కావడంతో ఓటు హక్కు రావడం సంతోషంగా ఉంది.
– ఎస్‌కే.యాసిన్, కొమ్మేపల్లి కాలనీ
సత్తుపల్లి మున్సిపాలిటీలో ఓటర్లుగా కలపాలని ఆరేళ్ల నుంచి వేడుకుంటున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు మున్సిపల్‌లో విలీనం చేసి సమస్యను పరిష్కరించారు. అధికారులు మున్సిపాలిటీ నుంచి మిగతా సేవలు కూడా అందించాలి.
– గుర్రాల చెన్నారావు, కొమ్మేపల్లి కాలనీ
కొమ్మేపల్లి పునరావాస కాలనీకి చెందిన 449 మంది ఓటర్ల సమస్యపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈనెల 3న రిజర్వేషన్లపై ఉత్కంఠ, 5న కొమ్మేపల్లి కాలనీలో ఇంటింటి సర్వే, 6న ఇది ఎవరికీ పట్టని కాలనీ శీర్షికలతో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. ఈమేరకు ఆగమేఘాలపై కొమ్మేపల్లి కాలనీలో ఇంటింటి సర్వే చేసి నివేదికలు సమర్పించడంతో 449మందికి ఓటు హక్కు లభించింది. వీరిని సత్తుపల్లి మున్సిపాలిటీ 13వ వార్డులో చేర్చినట్లు మున్సిపల్ కమిషనర్ కొండ్రు నర్సింహ శుక్రవారం వెల్లడించారు. కాగా, ఈ వార్డులో ఇప్పటికే 1,923 మంది ఓటర్లు ఉండగా, కొమ్మినేపల్లి ఓటర్లతో కలిపి ఈ సంఖ్య 2,372కు చేరింది. ఈమేరకు అధికారుల ప్రకటనతో కాలనీవాసులు శుక్రవారం స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. అంతేకాక సమస్య ను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అండగా నిలి చిన ‘సాక్షి’ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపై మేమూ ఓటర్లమే!
ఇకపై మేమూ ఓటర్లమే!
ఇకపై మేమూ ఓటర్లమే!


