విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Jan 10 2026 9:15 AM | Updated on Jan 10 2026 9:15 AM

విధుల

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

చింతకాని: వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజల కు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, అలాకాకుండా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డి.రామారావు హెచ్చరించారు. చింతకాని పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన ఉద్యోగుల హాజరు, ఓపీ రికార్డులు పరిశీలించాక మాట్లాడారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. గర్భిణులు ప్రభు త్వ ఆస్పత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్‌, సీహెచ్‌ఓ వీరేందర్‌ పాల్గొన్నారు.

సొసైటీల ద్వారా

రైతులకు విస్తృత సేవలు

సత్తుపల్లిటౌన్‌: వ్యవసాయ పరపతి సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేలా సిద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సెక్రటరీ కె.సురేంద్రమోహన్‌ సూచించారు. సత్తుపల్లి పీఏసీఎస్‌ను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన యూరియా నిల్వ లు, ఇప్పటివరకు అమ్మకాలపై ఆరా తీశాక అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేసి ఉపయోగించాలని సూచించారు. ఆతర్వాత డీసీసీబీ బ్రాంచ్‌ను పరిశీలించిన సురేంద్రమోహన్‌ రైతులకు ఇచ్చిన రుణాలు, లక్ష్యాలపై అధికారులతో చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు కె.విజయ్‌కుమార్‌, డీసీఓ గంగాధర్‌, బ్యాంక్‌ సీఈఓ వెంకట ఆదిత్య, ఏడీ ఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ శ్రీనివాసరావు, మేనేజర్‌ కిషోర్‌కుమార్‌, సీఈఓ వీరస్వామితో పాటు చల్లగుండ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

మల్బరీ సాగుతో

మెరుగైన ఆదాయం

వైరారూరల్‌: కర్ణాటక రైతుల మాదిరి మల్బరీ, పట్టు పరిశ్రమ ద్వారా ఇక్కడి రైతులు అధిక దిగుబడితో మెరుగైన ఆధాయం సాధించాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ రాష్ట్ర డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా సూచించారు. వైరా రెబ్బవరంలో ఒకేచోట 30 మంది రైతులు సాగు చేస్తున్న మల్బరీ క్షేత్రాన్ని శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడా రు. ఆసక్తి ఉన్న రైతులను కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడి రైతులు అవలంబిస్తున్న విధానాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆతర్వాత రైతు సతీష్‌ సాగు యో గ్యం కాని చౌడు భూమిలో కొబ్బరిచెట్లు నాటడ మే కాక చేపల చెరువు తవ్వించడాన్ని పరిశీలించిన ఆమె అభినందించారు. ఈ విధానాన్ని అందరికీ వివరించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఉద్యాన అధికారి ఎం.వీ.మధుసూదన్‌, పట్టు పరిశ్రమ అధికారి ముత్యాలుతో పాటు అనితశ్రీ, వేణు, విష్ణు, కామేశ్వరరావు, దేవరాజు పాల్గొన్నారు.

రైతులకు సరిపడా యూరియా

కూసుమంచి: యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్‌ గోపి తెలిపారు. మండలంలోని చేగొమ్మ పీఏసీఎస్‌ వద్ద యూరియా పంపిణీని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల సాగు, యూరియా అవసరంపై రైతులతో మాట్లాడారు. యూరియా నిల్వలు, డిమాండ్‌, సాగు ఆధారంగా నియోజకవర్గంలోని సబ్‌సెంటర్ల ద్వారా పంపిణీ చేస్తుండడంతో ఇబ్బంది రాలేదని అధికారులు తెలిపారు. ఈ విధా నం బాగుందని అభినందించిన సంచాలకులు, అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, ఏడీఏ సతీష్‌, ఏఓ వాణి, సీఈఓ రామకృష్ణ పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
1
1/3

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
2
2/3

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
3
3/3

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement