పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివా రం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
రేపు వేలం పాటలు
ఆలయ కొత్త కాంప్లెక్స్‌లోని 1,2,3 నంబర్ షాపులు, పాతకాంప్లెక్స్‌లోని 3,4 షాపులు, చీరలు పోగుచేసుకునే, పూలదండల విక్రయాల లైసెన్స్ హక్కులకు మంగళవారం సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు.
కేటీఆర్ పర్యటనను
విజయవంతం చేయాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
రేగా కాంతారావు
సూపర్‌బజార్(కొత్తగూడెం): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 7న కొత్తగూడెంలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కోరారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తారని, ఇటీవల విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లను సన్మానిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాజీ కాపు సీతాలక్ష్మి, నాయకులు రాజుగౌడ్, రామకృష్ణ, రాంప్రసాద్ పాల్గొన్నారు.


