సీఎం, పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్తా..
సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయితో కలిసి ర్యాలీ నిర్వహించగా, ఆతర్వాత జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ విశ్వనాథన్‌కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అందరు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించవద్దన్నారు. నియోజకవర్గంలో పందేలకు అడ్డుకట్ట వేయడంతో తనపై కక్షకట్టారని మండిపడ్డారు. నాయకులు వందనపు సత్యనారాయణ, శివవేణు, దోమ ఆనంద్, చల్లగుళ్ల నర్సింహారావు, ఎండీ.కమల్‌పాషా, గాదె చెన్నారావు, నారాయణవరపు శ్రీనివాస్, సుబ్బారెడ్డి, దొడ్డా శ్రీనివాసరావు, తోట సుజలరాణి, చల్లారి వెంకటేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ


