ఈస్ట్‌జోన్ క్రికెట్ గోల్డ్‌కప్ టోర్నీలో రన్నరప్‌గా ఖ
కేయూక్యాంపస్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ ఈస్ట్‌జోన్ క్రికెట్ గోల్డ్‌కప్ పోటీలు శనివారం ముగిశాయి. ఫైనల్స్‌లో హనుమకొండ – ఖమ్మం జట్లు తలపడగా 20 ఓవర్లలో హనుమకొండ జట్టు మూడు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఆ తర్వాత ఖమ్మం జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులే చేయడంతో హనుమకొండ జట్టు చాంపియన్‌గా, ఖమ్మం జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆయా జట్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యుడు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురువారెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు.


