రామభక్తుల పాదయాత్ర
జూలూరుపాడు: ధనుర్మానం సందర్భంగా శనివారం పలువురు రామభక్తులు పాదయాత్ర నిర్వ హించారు.జూలూరుపాడులోని శ్రీసీతారామ చం ద్రస్వామి ఆలయం, గుండెపుడి శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం నుంచి ఖమ్మంజిల్లా ఏన్కూ రు మండలం నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగింది. యాత్రకు ముందు, తర్వాత ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోలీసుల
విస్తృత తనిఖీలు
ఖమ్మంక్రైం: నేరాల నియంత్రణ, అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడి కోసం సీపీ సునీల్‌దత్ ఆదేశాలతో పోలీసులు జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివా రం ఉదయం వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏటీఎం సెంటర్లు, బ్యాంకు పరిసరాల్లో పరిశీలించిన వారు అక్కడ భద్రతపై ఆరాతీశారు. సరిహద్దు రాష్ట్రాల మీదుగా ఇసు క, గంజాయి, రేషన్ బియ్యం అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మ రం చేసినట్లు సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తామని వెల్లడించారు.
జాబ్‌మేళాలో
40 మంది ఎంపిక
ఖమ్మంరాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన శనివారం జాబ్ మేళా నిర్వహించారు. వరుణ్ మోటార్స్‌లో ఉద్యోగాలకు నిర్వహించిన జాబ్‌మేళాకు 101 మంది అభ్యర్థులు హాజరు కాగా ఇంటర్వ్యూల అనంతరం 40 మందిని ఎంపిక చేశా రు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్
అభిమానులకు బెయిల్
స్వాగతం పలికిన
కుటుంబీకులు, అభిమానులు
ఖమ్మంమయూరిసెంటర్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న, ఓపార్టీ నేతల జోక్యంతో పెట్టి న కేసుతో జైలుకు వెళ్లి న వైఎస్సార్, జగన్ అభిమానులకు బెయిల్ లభించింది. ఈ మేరకు ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, యర్రా నాగరాజురెడ్డి, గంగరబోయిన రవి, గణ పారపు మురళి, సరికొండ రామరాజు, శివారెడ్డి తదితరులకు శనివారం పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయగా జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వారికి కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ అభిమానులు స్వాగతం పలికారు. ఆ తర్వాత జిల్లా జైలు నుంచి నేరుగా రాపర్తినగర్ చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు తుమ్మ అప్పిరెడ్డి, లక్కినేనిసుధీర్‌బాబు, ఆలస్యం రవి, భువనగిరి వెంకటరమణ, ఎదులూరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
సీనియర్
అసిస్టెంట్‌కు పదోన్నతి
ఖమ్మంసహకారనగర్: డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గాయత్రికి పదోన్నతి లభించింది. ఆమెకు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించడంతో పాటు వరంగల్ డీఈఓ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి పేరిట శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి.
డబ్బు ఇవ్వలేదని ఇద్దరిపై దాడి
ఖమ్మంఅర్బన్: అడిగితేడబ్బు ఇవ్వలేదని గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌తో పాటు ఆయన మిత్రుడిపై దాడిచేశారు. ఖమ్మం బల్లేపల్లిలోని ఒకఅపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న కనకం మధుసూదన్‌రావు, ఆయన మిత్రుడితో కలిసి వైన్స్ వైపు గతనెల 31న వెళ్తుండగా మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్య క్తులు ఆ పారు. ఈ సందర్భంగా వారు డబ్బు అడిగితే లేవ ని చెప్పడంతో ఇద్దరిపై దాడి చేశా రు. బాధితులు శనివారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
రామభక్తుల పాదయాత్ర
రామభక్తుల పాదయాత్ర


