ప్రాణాలు తీసిన ఓవర్ టేక్
ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
ఖమ్మంక్రైం: ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలనే ప్రయత్నంలో అతివేగంగా వెళ్లడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు చావు బతుకుల్లో చికిత్స పొందుతున్నాడు. ఖమ్మంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాద వివరాలను వన్‌టౌన్ సీఐ కరుణాకర్ వెల్లడించారు. ప్రకాష్‌నగర్‌కు చెందిన సుంకుగోపి (19) ఆటో నడుపుతుండగా, ఆయన స్నేహితుడు కిన్నెర అశిష్ డీమార్ట్‌లో పనిచేస్తున్నాడు. వీరిద్దరు శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై పాకబండ బజార్ వైపు చర్చి కాంపౌండ్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమాన బైక్ అదుపుతప్పి బ్రిడ్జిపై పుట్‌పాత్‌ను ఢీకొట్టారు. ఘటన లో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించేసరికి గోపి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే, అశిష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రకాశ్‌నగర్‌కు చెందిన శ్రీను – రజిత దంపతులకు గోపి ఏకై క కుమారుడు కావడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.
అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి
ముదిగొండ: ఓ కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ముదిగొండ మండలం కమలాపురంలో శనివారం చోటుచేసుకుంది. ఓ రైతు పొలంలో కూలీ పనులకు కమలాపురానికి చెందిన యల్లాల ఉపేందర్ (23) వెళ్లాడు. పొలంలోనే ఆయన అనుమానస్పద స్థితిలో మృతిచెందగా, కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ అశోక్ పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అయితే, ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ మురళి తెలిపారు.
ఉరి వేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
బోనకల్: మండలంలోని ముష్టికుంట్లకు చెందిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఆవుల చిన్న బజారు(75)కొన్నాళ్ల నుంచి అనా రోగ్యంతో బాధపడుతుండగా ఇటీవల ఒక కాలు తొలగించారు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్న ఆయన శనివారం ఎవరూ లేని సమయాన ఉరి వేసుకున్నాడు. మృతుడికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
తల్లాడ: మండలంలోని అంబేడ్కర్‌నగర్ వద్ద శనివారం ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నా యి. హైదరాబాద్ నుంచి తల్లాడ వైపు కారు వస్తోంది. తల్లాడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మరో కారును డ్రైవర్ జాతీయ రహదారిపై గొర్రెల గుంపును తప్పించబోయి ఎదురుగా వచ్చేకారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతినగా, ఒక కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: ఖమ్మం బొక్కలగడ్డలో సొంత పెద్దమ్మను హత్యచేసిన నిందితుడిని త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వెంకటేశ్వరనగర్‌కు చెందిన రౌడీషీటర్ శేఖర్ ఆస్తితగాదాల నేపథ్యాన పెద్దమ్మ మోటె రాములమ్మను ఈ నెల 1న దారుణంగా హతమార్చి పారిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు.
ప్రాణాలు తీసిన ఓవర్ టేక్
ప్రాణాలు తీసిన ఓవర్ టేక్


