రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ముదిగొండ: మండలంలోని గంధసిరి వద్ద మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే అంశంపై గత నెల 31న ‘సాక్షి’లో ‘అక్రమాలకు సహకారం’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ మురళి తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్‌ఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.
ఖమ్మంలో నాలుగు...
ఖమ్మంక్రైం: ఖమ్మం ప్రకాష్‌నగర్ బ్రిడ్జి వద్ద శనివా రం చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్స్, త్రీటౌన్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ట్రాక్టర్లను త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ తరలించారు.
జూనియర్
అసిస్టెంట్ సస్పెన్షన్
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె.రవితేజను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌ఓ డి.రామారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తిరుమలాయపాలెం ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా డిప్యుటేషన్‌పై పనిచేసిన సమయాన అక్కడి సిబ్బందికి భయం, అసౌకర్యం కలిగించేలా వ్యవహరించినట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ విషయమై విచారణ చేపట్టగా రవితేజపై ఆరోపణలు నిజమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్లు డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు.


