●హోదా మారినా పని మానలేదు..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కలిసి వచ్చిన రిజర్వేషన్లకు తోడు ప్రజాసేవపై ఆసక్తితో పలువురు పోటీ చేశారు. ఇందులో సర్పంచ్‌లుగా గెలిచిన వారు కొందరు గతంలో చేసిన పనులు మానేయగా
ఇంకొందరు కుటుంబ పోషణ కోసం హోదాను పక్కనపెట్టి మళ్లీ
అవే పనుల్లో నిమగ్నమయ్యారు. కూసుమంచి మండలంలోని నర్సింహులగూడెం సర్పంచ్‌గా గెలిచిన కలికిని సరిత కుటుంబానికి కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉండగా, ఇతరుల పొలాల్లో కూలీకి వెళ్లేవారు. ప్రస్తుతం కూడా ఆమె గ్రామస్తులతో కలిసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఆడంబరాలను దరిచేరనివ్వకుండా పనుల్లో నిమగ్నమైన ఆమెను పలువురు అభినందిస్తున్నారు. –కూసుమంచి


