సమాజ సేవ అందరి బాధ్యత
●కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ నారాయణ
రఘునాథపాలెం/చింతకాని/తిరుమలాయపాలెం: సమాజ సేవను అందరూ బాధ్యతగా భావించాలని, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఇందులో కీలకంగా వ్యవహరించాలని కాకతీయ విశ్వవిద్యాలయ ఎన్‌సీసీ కోఆర్డి నేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ సూచించారు. రఘునాథపాలెం మండలం రేగులచలకలో ఎంజేపీటీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శీతాకాల శిబిరం శుక్రవారం ముగియగా ఆయన మాట్లాడారు. ప్రిన్సిపాల్ వై.నాగేశ్వరరావు, ఆర్‌సీఓ సీ.హెచ్.రాంబాబు, సర్పంచ్ యండపల్లి రమాదేవి సత్యం, అధ్యాపకులు డాక్టర్ ఎన్.స్వాతి, సునీత, వినీల, అనిత, హుస్సేనితో పాటు నున్నా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే, చింతకాని మండలం తిరుమలాపురంలో నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యాన, తిరుమలాయపాలెంలో ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శిబిరాలను నారాయణ ప్రారంభించారు. డీఐఈఓ రవిబాబు, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా పీఓ డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు మల్లయ్య, చాపలమడుగు వీరబాబు, నాగమణి, పి.నవీన్‌బాబు, కృష్ణార్జున్‌రావు, స్వాతి, ఉమారాణి, సుజాత, విజయకుమారి పాల్గొన్నారు.


