కార్యాలయాల్లో మెరుగైన వసతులు
ఖమ్మం సహకారనగర్: ప్రజాసేవల్లో నాణ్యత పెంచేలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన మరమ్మతులు, కావాల్సిన వసతులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ భవనం, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, విశ్రాంతిగృహం, బాల రక్షా భవనం, గిరిజన భవనాన్ని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో ఆయన పరిశీలించారు. కార్యాలయాల్లో ఉద్యోగులతో మాట్లాడి వసతులు, పని వాతావరణం, ఇంకా కావాల్సిన సదుపాయాలపై ఆరాతీశాక కలెక్టర్ మాట్లాడారు. అనంతరం హరిత హోటల్ నిర్మాణానికి స్థలం గుర్తింపు కోసం ఎన్నెస్పీ క్యాంప్‌తో పాటు పలు ప్రభుత్వ భూములను కలెక్టర్ పరిశీలించారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు నాగేశ్వరరావు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
హరిత హోటల్ నిర్మాణానికి స్థలసేకరణ


