
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీసేవ నిర్వహించారు. అలాగే, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని గోకులంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ధరలు పెంచితే చర్యలు
ముదిగొండ: యూరియా స్టాక్ లేదంటూ డీలర్లు ధరలు పెంచి అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య హెచ్చరించారు. ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఎరువుల దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించి డీలర్లకు సూచనలు చేశారు. స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ నిర్ణీత ధరకే ఎరువులు అమ్మాలని సూచించారు. అలాగే, నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఏఓ సరిత పాల్గొన్నారు.

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం