
రొట్టమాకురేవు నుంచి ఎర్రకోటకు..
కారేపల్లి: మారుమూల ఆదివాసీ గ్రామానికి చెందిన మహిళ దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర సంబురాల్లో పాల్గొంది. కారేపల్లి మండలం రొట్టమాకురేవు గ్రామానికి చెందిన ఇర్ప సుహాసిని గతంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా వ్యవహరించింది. అలాగే, గ్రామంలో గోదావరి సమాఖ్య ద్వారా మహిళలకు పొదుపు, రుణాల మంజూరు, చెల్లింపునకు చేసిన కృషికి గాను ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వా నించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సుహాసిని మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధాని జాతీయ జెండా ఎగురవేయడాన్ని స్వయంగా చూడడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
రామయ్యకు
సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు.