
ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎం
ఖమ్మంవైరారోడ్: ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ పాలక మండలి ఎన్నికలు మంగళవారం జరగగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఓటు వేశారు. ప్రతిష్ఠాత్మక కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు సభ్యులుగా కొనసాగుతారు. ఈమేరకు పోలింగ్‌లో వద్దిరాజుతో పాటు మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, బాల్కన్ సుమన్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఊర చెరువు
బుంగకు మరమ్మతులు
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామ ఊర చెరువుకు వర్షానికి బుంగ పడింది. దీంతో నీరు వృథాగా పోతుండగా మంగళవారం ఇరిగేషన్ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, తహసీ ల్దార్ రమాదేవి ఆధ్వర్యాన బుంగ పూడ్పించారు. అలాగే, తూ ము పైపులైన్లు పగిలిన చోట కొత్తవి వేయించారు.
భూదాన్ భూమిలో
నిర్మాణంపై అభ్యంతరం
ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్ల గుట్టపై ఏర్పాటైన వినోబా నవోదయ కాలనీ సమీపాన వాటర్ ట్యాంక్, ప్రహరీనిర్మాణాన్ని కాలనీ వాసులు మంగళవారం అడ్డుకున్నారు. ఇక్కడ 12ఏళ్ల నుంచి పలువురు నివాసం ఉంటుండగా.. ప్రొసీడింగ్స్, ఇంటి నంబర్లు పొందినా విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించలేదని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యాన కోర్టులో స్టేటస్ కో ఉన్న భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూప్రహరీ నిర్మించడం సరికాదని జేసీబీలు, పొక్లెయినర్లతో వచ్చిన రెవెన్యూ, పోలీసు సిబ్బంది ని అడ్డుకున్నారు. దీంతో తహసీల్దార్ సైదులు, సీఐ భానుప్రకాష్ చేరుకుని వారితో చర్చించా రు. అయితే, తమకు విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని స్థానికులు పేర్కొనడంతో ప్రజా అవసరాలు తీర్చే నిర్మాణాలకు సహకరించాలని అధికారులు సూచించారు. కాగా, ట్యాంక్ ద్వారా తమకు నీరు అందించడమే కాక విద్యు త్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
‘జాతీయ క్రీడా బిల్లు’పై మాట్లాడిన ఎంపీ రవిచంద్ర
ఖమ్మంవైరారోడ్: రాజ్యసభలో మంగళవారం జాతీయ క్రీడలపాలన బిల్లు, ఉత్ప్రేరకాల నిరో ధక బిల్లును కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగి న చర్చలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. క్రీడలు, క్రీడాకారులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ల పాలనలో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపా రు. దీంతో రాష్ట్ర క్రీడాకారులు పలువురు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చాటారని వెల్లడించారు. అంతేకాక క్రీడారంగానికి అత్యధిక నిధులు కేటాయించి జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టేడియం నిర్మించారని తెలి పారు. అయితే, కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో క్రీడారంగానికి రూ.2161 కోట్లు కేటాయించి తెలంగాణకు కేవలం రూ.17 కోట్లే ఇవ్వడంస సరికాదని పేర్కొన్నారు. ఇకనైనా కేటాయింపుల్లో సవరణలు చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు.
డైట్ ప్రిన్సిపాల్‌గా
మేర్‌జుల్లా ఖాన్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం డైట్ ప్రిన్సిపాల్‌గా మహ్మద్ మేర్‌జుల్లా ఖాన్ నియమితులయ్యారు. మహబూబ్‌నగర్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న ఆయనకు ఖమ్మం ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక్కడ డైట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయడంతో మేర్‌జుల్లా ఖాన్‌ను నియమించారు.

ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎం

ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో ఓటు వేసిన ఎం