
ఎంత వరద వస్తే ఎక్కడ నష్టం?
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో కురిసే వర్షంతో పాటు ఎగువ నుంచి వరద వస్తే మున్నేరు పోటెత్తే అవకాశముంది. గతేడాది సెప్టెంబర్ 1న తెల్లవారుజాము 4గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చిన వరదతో పరీవాహక కాలనీలకు భారీ నష్టం ఎదురైంది. ఈమేరకు గత ఏడాది వరద అంచనా ఆధారంగా మున్నేటికి ఎన్ని అడుగుల వరద వస్తే ఎన్ని కాలనీల్లో ఎన్ని ఇళ్లు నీట మునుగుతాయో అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో భాగంగా 16 అడుగులు వరద వస్తే మునిగే ఇళ్లను గూగుల్ ఎర్త్ మ్యాప్‌లో ఆరెంజ్ జోన్‌గా, 20 అడుగులు వస్తే మునిగే ప్రాంతాన్ని బ్లూ జోన్‌గా, 25 అడుగుల వరదతో నష్టం ఎదురయ్యే ప్రాంతాన్ని పింక్ జోన్‌గా గుర్తించడమే కాక 32 అడుగుల వరద వస్తే ప్రభావితమయ్యే ప్రాంతాలను రెడ్ జోన్‌లో చేర్చారు. ఈమేరకు డివిజన్లు, ఇళ్ల వారీగా జోన్లను నిర్ధారించి వరద ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదుకు సిద్ధమయ్యారు.
గతేడాది ముంపు ఆధారంగా మ్యాపింగ్