
జిల్లా అంతటా వర్షం
ఖమ్మంవ్యవసాయం: జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8–30 నుంచి రాత్రి 9గంటల వరకు కురిసిన వర్షపాతంపై వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. ఈమేరకు అత్యధికంగా మధిరలో 87.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, బాణాపురంలో 84.5, బచ్చోడులో 76.3, సిరిపురంలో 75, కాకరవాయిలో 68, వేంసూరులో 66, ఎర్రుపాలెంలో 65.3, నాగులవంచలో 62.8, కూసుమంచిలో 60 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంతేకాక బోనకల్, నేలకొండపల్లి, సత్తుపల్లి, కల్లూరు, రఘునాథపాలెం, ఖమ్మం మండలాల్లోనూ ఓ మోస్తరు వర్షం నమోదైందని నివేదికలో వెల్లడించారు.