
ఫలితం ఏదీ?
పడిగాపులు
కాసినా
పని వదిలేసుకుని వచ్చా....
చేను పని వదిలేసుకుని రోజంతా లైన్‌లో ఉన్నా. నాలుగెకరాల్లో పత్తి వేశానని చెప్పినా రెండు యూరియా కట్టలే ఇచ్చారు. ఈ యూరియా పంటకు ఎటూ సరిపోదు. పెద్ద సార్లు అవసరం తగ్గట్టుగా యూరియా ఇవ్వకపోతే పంట నష్టపోతాం.
– భూక్యా తులిస్యా, రైతు, వెంకిట్యాతండా
రెండు బస్తాలే ఇచ్చారు...
పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. కానీ రెండు యూరియా బస్తాలే ఇచ్చారు. దీనికోసం చేను పని వదిలేసుకొని పొద్దాక ఉండాల్సి వచ్చింది. యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుంది. అధికారులు ఆలోచించి సరిపడా ఇవ్వాలి.
– ఉప్పుగండ్ల శ్రీనివాసరావు, రైతు, పేరుపల్లి
కారేపల్లి: యూరియా కోసం రైతులు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్ని కావు. సొసైటీ కార్యాలయాల వద్ద పొద్దంతా పడిగాపులు కాసినా రెండుకు మించి బస్తాలు ఇవ్వకపోవడం.. పంటలకు అవసరం పెరుగుతుండంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ) పరిధి గ్రామాల్లో సుమారు 5వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. కానీ సొసైటీ ద్వారా రెండు నెలల్లో 7,244(3259.80 క్వింటాళ్లు) యూరియా బస్తాలను 2682 మంది రైతులకు పంపిణీ చేశారు. జూన్‌లో వ్యవసాయ భూమి ఆధారంగా ఐదు బస్తాల వరకు పంపిణీ చేయగా.. జూలైలో ఎంత భూమి ఉన్నా రెండేసి బస్తాలే ఇచ్చారు. ఇక ఈనెలలోనూ అదే పరిస్థితి ఉండడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యూరియా అవసరం పెరగడంతో సొసైటీకి ఎప్పుడు స్టాక్ వచ్చిందని తెలిసినా ఉదయం లైన్ కడుతున్నారు. రోజంతా వేచి ఉన్నా ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
యూరియా కోసం రైతుల వెతలు
రేషన్ విధానంలో పంపిణీపై అసహనం

ఫలితం ఏదీ?

ఫలితం ఏదీ?