
ఎస్‌టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శిగా చావా రవి
ఖమ్మం సహకారనగర్ : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు ఏడు లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, కేంద్ర కమిటీ సభ్యులుగా సీహెచ్.దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజా న్, పారుపల్లి నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోల్‌కతా నగరంలో జరుగుతున్న ఎస్‌టీఎఫ్‌ఐ 9వ రజతోత్సవ మహాసభలో వీరిరువురు ఎన్నిక కావడం హర్షణీయమని పేర్కొన్నారు. చావా రవి 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసి, ప్రస్తుతం అఖిల భారత ఉపాధ్యాయ ఉద్యమానికి నాయకత్వం వహించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. దుర్గాభవాని మహిళా ఉపాధ్యాయులను చైతన్యపరుస్తూ, ఆదర్శవంతంగా పనిచేసి బాలికల విద్యావ్యాప్తికి కృషిచేస్తున్నారని పేర్కొన్నా రు. వీరి ఎన్నిక పట్ల యూటీఎఫ్ నాయకులు జి.వి.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమి, వల్లంకొండ రాంబాబు హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర కమిటీ సభ్యులుగా దుర్గాభవాని

ఎస్‌టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శిగా చావా రవి