నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

Aug 11 2025 6:54 AM | Updated on Aug 11 2025 6:54 AM

నేడు

నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

● 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు మాత్రల పంపిణీ ● జిల్లావ్యాప్తంగా 3,11,317 మంది పిల్లల గుర్తింపు ● అందుబాటులో 3.30 లక్షల మాత్రలు ● మిస్‌ అయిన వారికి 18న మాప్‌ అప్‌ రౌండ్‌

నూరు శాతం సక్సెస్‌కు..

జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ముందస్తుగా ఇంటింటి సర్వే నిర్వహించగా మొత్తం 3,11,317 మంది ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు మింగించేలా 3.30 లక్షల మాత్రలు సిద్ధం చేసి ఇప్పటికే అన్ని కేంద్రాలకు పంపిణీ చేశారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నూరు శాతం అమలయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి అంగన్‌వాడీలు 1,840 మంది, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ వర్కర్లు 1,260మంది, ఆశాలు 1,339. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,750 మంది సిబ్బందిని నియమించింది. ఒకవేళ నేడు(సోమవారం) మిస్‌ అయిన పిల్లలకు ఈ నెల 18న మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహించనున్నారు.

మాత్రలు మింగించే విధానం, జాగ్రత్తలు..

●1 నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలకు ఆల్బెడజోల్‌ మాత్రలు వేయనుండగా.. 1 నుంచి 2 ఏళ్ల చిన్నారులకు అర(1/2) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్‌) చేసి నీటితో మింగించాలి.

●2 నుంచి 3 ఏళ్ల చిన్నారులకు పూర్తి(ఫుల్‌) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్‌) చేసి నీటితో మింగించాలి.

●3 నుంచి 19 ఏళ్ల వరకు ఉన్నవారికి ఒక మాత్ర నమిలి మింగించాలి.

●అనారోగ్య సమస్యలు, ఇతర చికిత్సలు తీసుకున్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రలు మింగించొద్దని, పిల్లలకు మధ్యా హ్న భోజనం అయిన అరగంట తర్వాతనే మాత్రలు మింగించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

అల్బెండజోల్‌ మాత్రలు మింగించే కార్యక్రమం నూరుశాతం పూర్తి చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు తప్పకుండా మాత్రలు మింగించాలి. పిల్లలు గోళ్లు కత్తిరించుకోకపోవడం, చేతులు కడకుండా భోజనం చేయటం ద్వారా పేగుల్లోకి నట్టలు చేరి ఆకలి మందగించడంతో పాటు రక్తహీతన ఏర్పడి అనారోగ్యపాలవుతారు. అలా జరగకుండా పిల్లలకు మాత్రలు వేయించి వారి కడుపులోని నులిపురుగులను అంతం చేయొచ్చు. సోమవారం మిస్‌ అయిన పిల్లలకు ఈ నెల 18 ప్రత్యేక మాప్‌ అప్‌ రౌండ్‌ ద్వారా మళ్లీ మాత్రలు అందిస్తాం.

– డాక్టర్‌ చందూనాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

వివిధ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల వివరాలు..

అంగన్‌వాడీల్లో (1 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు) 74,641

ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల పిల్లలు 95,276

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు 6,040

ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాల విద్యార్థులు 1,35,360

నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
1
1/1

నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement