
బ్యాంకింగ్ రంగంలో పెనుమార్పులు
ఖమ్మంగాంధీచౌక్: బ్యాంకింగ్ రంగంలో పెను మా ర్పులు చోటు చేసుకుంటున్నాయని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో రెండు రోజులుగా జరుగుతున్న యూనియన్ వర్కింగ్ కమిటీ సమావేశాలు శుక్రవారం ముగిశా యి. ఈ ముగింపు సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులు అధికారులు, ఉద్యోగులపై భారంగా పరిణమించాయని చెప్పారు. ఈ కారణంగా పనిభారం, ఒత్తిడి పెరిగి సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయితే, పెరిగిన భారానికి అనుగుణంగా ప్రోత్సాహకం లేకపోవడం మరింత ఆవేదన కలిగి స్తోందని చెప్పారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాండిల్య మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందన్, ఖమ్మం జిల్లా రీజనల్ కార్యదర్శి చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుంచి 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్