నేడు హెచ్‌టీ విద్యుత్ వినియోగదారుల సదస్సు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని హెచ్‌టీ విద్యుత్ వినియోగదారుల నెలవారీ సదస్సు శనివారం ఏర్పాటుచేసినట్లు ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సద స్సు మొదలవుతుందని, హెచ్‌టీ వినియోగదారులు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈ సదస్సులో విద్యుత్ అకౌంట్స్, ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు.
ఎత్తిపోతల పథకాల
మరమ్మతులకు నిధులు
ఖమ్మంఅర్బన్: జిల్లాలోని మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయి. జలవనరుల శాఖ ఈఎన్‌సీ అనిల్‌కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి సమర్పించిన మూడు పనులకు నిధుల మంజూరు అనుమతి ఇచ్చారు. భక్తరామదాసు ప్రాజెక్టుకు విద్యుత్ యంత్రాల మరమ్మతులకు రూ.10 లక్షలు, ముఠాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరమ్మతులకు రూ.25.50 లక్షలు, మోటాపురం లిఫ్ట్ బోర్ మరమ్మతుకు రూ.7.70 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. వీసీలో జిల్లా నుంచి ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వరరావు, డీఈలు మన్మధరావు, అయోష, శోభారాణి, పృధ్వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఏఎస్‌కు స్కూళ్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బీఏఎస్) పథకానికి ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో కొత్త పాఠశాలలు ఎంపిక చేయనుండగా.. స్టేట్, సెంట్రల్ బోర్డు ద్వారా గుర్తింపు కలిగిన స్కూళ్ల బాధ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. గత ఐదేళ్లలో ఏడు నుంచి 10వ తరగతిలో 90శాతం కంటే ఎక్కువ ఫలితాలు, 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు మొదటి తరగతి ఉత్తీర్ణత సాధించడమే కాక విశాలమైన తరగతి గదులు, వసతి, క్రీడా మైదానం, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలని తెలి పారు. ఈమేరకు ఆసక్తి కలిగిన పాఠశాలల యాజమాన్యాలు పూర్తి వివరాలతో ఈనెల 25వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని డీడీ సూచించారు.
గిరిజన గురుకుల కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం సీట్ల్లు భర్తీ అయ్యాయని పీఓ బి.రాహు ల్ తెలిపారు. గురుకులాల్లో బాలికలకు 737 సీట్లు ఉండగా, భద్రాచలంలోని గురుకుల కాలేజీలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినుల్లో 737 మందికి మెరిట్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు కేటాయించామని పీఓ తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీఓలు అరుణకుమారి, పద్మావతి, ప్రిన్సిపాళ్లు చైతన్య, నాగేంద్రమ్మ, రాణి, ఓ.మాధవి, సంధ్యరాణి, మాధవీలత, ఓ.పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులను తీర్చిదిద్దాలి
కొణిజర్ల: వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న శిబిరాల ద్వారా విద్యార్థినులను ఎంచుకున్న రంగాల్లో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కొణిజర్ల సమీపాన కేజీబీవీలోని సమ్మర్ క్యాంపును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ బోధన, ఇతర అంశాలపై ఆరా తీశాక విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. జీసీడీఓ తులసి, ఎంఈఓ అబ్రహం, ఎంపీడీఓ రోజా, ఎంపీఓ రాజేశ్వరి, క్యాంపు కోఆర్డినేటర్ లావణ్య, అసిస్టెంట్ కోఆర్డినేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
నేడు హెచ్‌టీ విద్యుత్ వినియోగదారుల సదస్సు


