రక్షణపై మాక్‌డ్రిల్‌తో అవగాహన
ఖమ్మంమయూరిసెంటర్: యుద్ధం వస్తే పౌరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాజీ సైనికులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఖమ్మం ఎన్నెస్పీ హైస్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో మాజీ సైనిక ఉద్యోగులు, ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి ఎస్.ఎం.అరుణ్ పర్యవేక్షణలో ఈ డ్రిల్ జరిగింది. భవనాలపై బాంబులు పడినప్పుడు మంటల నుంచి బయటపడడాన్ని అరుణ్ ప్రత్యక్షంగా వివరించారు. అలాగే, గాయపడిన వారికి ప్రథమ చికిత్స, రాత్రి వేళ ఉనికి తెలియకుండా లైట్లు ఆర్పడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్‌సీసీ సుబేదార్ మేజర్ బహుదూర్, జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్‌కుమార్, ఆర్‌పీఎఫ్ సీఐ, మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో పాటు వెంకటేష్, నాళ్ల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతులు
ఒకపూటే నిర్వహించాలి
బోనకల్: ప్రభుత్వం ఈనెల 13వ తేదీ నుండి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుండగా, ఎండల తీవ్రత దృష్ట్యా ఒక పూటే నిర్వహించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. బోనకల్‌లో శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణను జిల్లా కేంద్రంలో కాకుండా డివిజన్ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. అలాగే, పాఠశాలలు తెరిచేనాటికి సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సమకూర్చాలని, ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్లులు, డీఏ, పీఆర్‌సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వల్లంకొండ రాంబాబు, గుగులోతు రామకృష్ణ, రమేష్, సూర్య, తులసీదాస్, ఉద్దండ్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
బోనకల్/ఎర్రుపాలెం: ఇప్పటికే జాప్యమైనందున ఇకనైనా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బోనకల్ మండలం జానకీపురం, ఎర్రుపాలెం మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఇటీవల ఉద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. అలాగే, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ పేరిట కాలయాపన చేయొద్దని సూచించారు. 317 జీఓ ద్వారా ఉపాధ్యాయులకు జరిగిన నష్టాన్ని సవరించడమే కాక ఉపాధ్యాయ శిక్షణ జిల్లా కేంద్రంగా కాకుండా మండలాల్లో ఏర్పాటు చేయాలన్నారు. కాగా, బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొ ని విద్యార్థుల సంఖ్య పెంపునకు పాటుపడాలని సూచించారు.ఈసమావేశాల్లో పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, మండలాల బాధ్యులు రామ్మోహన్‌రావు, రవికిరణ్, రవికుమార్, కొండల్‌రావు, బి.మదనమోహన్‌రెడ్డి, మారపాక బాబురావు, శెట్టిపల్లి సంగిరెడ్డి, రవికిరణ్, కొండలరావు, సత్యనారాయణరెడ్డి, ఎస్.కే.రమేష్, గోపీకృష్ణ, రేణుక, అప్పిరెడ్డి, సాంబయ్య, లింగయ్య, కృష్ణవేణి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
దరఖాస్తుల
పరిశీలనలో వేగం
ఏన్కూరు: రాజీవ్ యువవికాసం పథకానికి అందిన దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తిచేసి సంబంధిత కార్పొరేషన్లకు పంపించాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగపద్మజ సూచించారు. ఏన్కూరు మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆమె దరఖాస్తుల పరిశీలనపై ఆరా తీశారు. త్వరగా ప్రక్రియను పూర్తి చేసి అర్హుల జాబితాను కార్పొరేషన్లకు పంపిస్తే లబ్ధిదారుల ప్రకటన సులవవుతుందని తెలిపారు. ఎంపీడీఓ జీవీఎస్.నారాయణ, సూపరింటెండెంట్ తుమ్మలపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అదుపు తప్పి
వాగులో పడిన లారీ
ఏన్కూరు: ఇసుక తీసుకెళ్తున్న లారీ అదుపు తప్పి వాగులో బోల్తాపడింది. భద్రాచలం నుండి ఇసుకతో లారీ ఏన్కూరు మండలం జన్నారం మీదుగా ఖమ్మం వెళ్తోంది. ఈక్రమాన గురువారం అర్ధరాత్రి జన్నారం సమీపంలో అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యా యి. అయితే, వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
రక్షణపై మాక్‌డ్రిల్‌తో అవగాహన
రక్షణపై మాక్‌డ్రిల్‌తో అవగాహన


