మార్కెట్‌లో వెలవెల.. రోడ్డంతా కళకళ
కార్బైడ్ రహితంగా పండించిన మామిడి పండ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఖమ్మం రోటరీనగర్‌లోని వీధివ్యాపారుల కేంద్రంలో ప్రత్యేక మార్కెట్ ఏర్పాటుచేశారు. పడావు పడి ఉన్న ప్రాంగణానికి రంగులు వేసి తీర్చిదిద్దారు. తొలిరోజు ఇక్కడ 10 – 15 మంది వ్యాపారులు మామిడి పండ్లు విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఒకటి, రెండు దాటకపోగా.. జనాలు రాకపోవడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మరోపక్క రహదారుల వెంట మామిడిపండ్ల విక్రయాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఎప్పటిలాగే కొనసాగుతోంది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్
మార్కెట్‌లో వెలవెల.. రోడ్డంతా కళకళ


