ప్రణాళికాయుతంగా ఖమ్మం అభివృద్ధి
ఖమ్మంవన్‌టౌన్: ఖమ్మం నగరంతో పాటు నియోజకవర్గాన్ని ప్రణాళికాయుతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 16వ డివిజన్‌లో లోటస్ హిల్స్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నగర అభివృద్ధిని క్రమపద్ధతిలో చేయాలని, ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. నీరు పారే మార్గాల్లో అక్రమ నిర్మాణాలు, ప్రార్థనా మందిరాలు నిర్మాణం జరగకుండా ప్రారంభంలోనే అడ్డుకోవాలని తెలిపారు. ఆక్రమణల్లో పేదలు ఉంటే వారికి ఇంటి స్థలం, ఇళ్లు, ప్రభుత్వ పథకాల కింద సాయం అందించాలని సూచించారు. మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మార్కెట్ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీఓ నర్సింహారావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, తహసీల్దార్ రవికుమార్, కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, రాపర్తి శరత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 39వ డివిజన్‌లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రను మంత్రి తుమ్మల ప్రారంభించారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


