Husband Commits Suicide In K`aranataka - Sakshi
Sakshi News home page

గాయత్రి నువ్వు లేని జీవితం నాకు వద్దు..

Mar 28 2022 11:02 AM | Updated on Mar 28 2022 6:00 PM

Husband Commits Suicide In karanataka - Sakshi

కర్ణాటక (మైసూరు) : భార్య లేని బతుకు వ్యర్థమని తలచి ఒక భర్త పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న సంఘటన మైసూరు తాలూకాలోని హంచ్యా గ్రామంలో చో­టు చేసుకుంది. వివరాలు.. రెండు నెలల క్రితమే మహేష్‌ (45) భార్య గాయత్రి (37) బీపీ మందులకు బదులుగా వేరే మందులు వేసుకోవడంతో ఆరోగ్యం దెబ్బతిని కన్నుమూసింది. అప్పటి నుంచి భార్యను తలుచుకుంటూ వేదన పడేవాడు. ఆదివారం ఉదయం ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు మహేష్‌ తన సోదరునికి ఫోన్‌ చేసి తాను చనిపోతున్నానని, తన ఇద్దరు పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement