
బనశంకరి: హత్యాయత్నం చేశారంటూ బెంగళూరు ఏసీపీ గోవర్ధన్, అతని తల్లిదండ్రులపై హైగ్రౌండ్స్ పోలీస్‌స్టేషన్‌లో భార్య అమృత ఫిర్యాదు చేసింది. ఆమె పలు తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తకు శిక్షణలో ఉన్న మహిళా డీఎస్పీతో అక్రమ సంబంధం ఉందని పేర్కొంది. ఆమైపె కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
ఆ మహిళా డీఎస్పీకి పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ నా భర్తతో స్నేహంగా ఉంటోంది. నా భర్త ఎక్కడ డ్యూటీలో ఉంటే అక్కడకు వస్తోంది. ఈ విషయాన్ని ప్రశ్నించానని నా భర్త కోపోద్రిక్తుడై నాపై దాడికి పాల్పడ్డారు. విడాకులు ఇస్తానని బెదిరించారు. అంతేగాక నాపై తప్పుడు కేసు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు, అత్త కిరోసిన్ పోసి నిప్పంటించాలని చూసింది అని చెప్పారు. పోలీసులు గోవర్ధన్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి విచారణ రావాలని ఆదేశించారు.