యదువీర్‌ రాజా విజయయాత్ర.. తిలకించిన భార్య త్రిషికా

Dussehra Celebrations Were Held At Amba Palace In Mysore - Sakshi

దర్బార్‌ సమాప్తం 

సాక్షి, మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలలో భాగంగా అంబావిలాస్‌ ప్యాలెస్‌లో రాజవంశీకుడు యదువీర్‌ ఒడెయార్‌ చివరిరోజు ఆదివారం ఘనంగా ప్రైవేటు దర్బార్‌ నిర్వహించారు. 9 రోజులుగా బంగారు సింహాసనంపై ఆసీనులై రాజాస్థానాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటలకు పట్టపుటేనుగు, గుర్రం, ఒంటె, ఆవులకు ప్యాలెస్‌ వాకిలి వద్ద పుజలు నిర్వహించి  ఉదయం 6.15 గంటలకు చండిహోమం నిర్వహించారు. 9.15 గంటలకు యదువీర్‌ వచ్చి పూర్ణాహుతి నిర్వహించారు.   

వెండి పల్లకీకి బదులు కారులో  
ఉత్సవాల ముగింపు రోజైన సోమవారం యదువీర్‌ రాచరిక సంప్రదాయాల ప్రకారం విజయ యాత్రను నిర్వహించారు. అయితే వెండి పల్లకీలో వెళ్లడానికి బదులు తన కారులోనే యాత్రను పూర్తిచేశారు. యుద్ధానికి బయల్దేరిన రీతిలో ఆయుధాలతో ఊరేగింపుగా అంబావిలాస్‌ ప్యాలెస్‌ ఆవరణ నుంచి అక్కడే ఉన్న భువనేశ్వరి అమ్మవారి దేవాలయానికి వచ్చి పూజలు చేశారు. జమ్మిచెట్టునూ పూజించారు. రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్, యదువీర్‌ భార్య త్రిషికా, కుమారునితో కలిసి ప్యాలెస్‌ నుంచి విజయయాత్రను తిలకించారు.   

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top