మైసూరు: సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం రాచనగరి మైసూరులో రాజ్యాంగ దినోత్సవ సభ జరగనుంది. మహారాజ కాలేజీ మైదానంలో భారీ సభావేదిక సిద్ధమైంది. విధానసౌధ తరహాలో వేదిక ముందుభాగాన్ని తీర్చిదిద్దారు. సీఎం డీకే శివకుమార్, సిద్దరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నాయకుల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు లక్ష మందిని తరలించాలని మంత్రి యతీంద్ర, సిద్దరామయ్య, ఆయన అనుకూల మంత్రులు నిశ్చయించారు. 50 వేల మంది కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు సీఎం డీకే శివకుమార్, సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు. సిద్ధరామయ్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీగా పోలీసు భద్రత ఏర్పాటైంది. పెద్దసంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు రానున్నారు.
సీఎం డీకే, సిద్దు, మంత్రుల హాజరు


