స్వతంత్ర పార్కులో నిరసనల హోరు | - | Sakshi
Sakshi News home page

స్వతంత్ర పార్కులో నిరసనల హోరు

Nov 26 2026 1:41 AM | Updated on Nov 26 2026 1:41 AM

బెంగళూరు స్వతంత్ర పార్కులో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

ఆశా కార్యకర్తల ఆందోళన

శివాజీనగర: నెలకు రూ.15,000 గౌరవ వేతనం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఆశా కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది. బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో ఎండ, చలి, వాన మధ్యనే ఆందోళనను కొనసాగిస్తున్నారు. రోడ్డు ముందు కూర్చున్న ఆశా కార్యకర్తలు, తమ డిమాండ్లు నెరవేరే వరకు కదలబోమని శపథం చేశారు. మంగళవారం నుంచి జల్లులు పడడంతో చలి మరింత పెరిగింది. జపాన్‌ నుంచి వీడియో కాల్‌ ద్వారా సీఎం డీ.కే.శివకుమార్‌ ఇచ్చిన హామీలను వారు ఒప్పుకోలేదు. మాటలతో పరిష్కారం కాదని స్పష్టం చేశారు. డిమాండ్లను నెరవేరుస్తామని లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని పట్టుబట్టారు. ధరలు భగ్గుమంటున్న నేటి రోజుల్లో నెలకు రూ.5 వేలతో బతకడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.

మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

ఓవైపు ఆశాల ధర్నాకు తోడు, ఫ్రీడంపార్క్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సిబ్బంది క్లస్టర్‌ కిచెన్‌ పథకం వద్దంటూ నిరసనకు దిగారు. భోజన తయారీ బాధ్యతను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం సరికాదని మండిపడ్డారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది వామపక్ష నేతలతో కలిసి బైఠాయించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో దత్తత, మార్గదర్శక పథకాన్ని రద్దు చేయాలని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కూడా నిరవధిక ధర్నా ప్రారంభించారు.

ఆశా కార్యకర్తలకు తోడు మధ్యాహ్న భోజన సిబ్బంది ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement